నయనతారకు అన్ని విషయాల్లోనూ మద్దతు తెలుపుతూ ఆమెకు తోడుగా నిలుస్తున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్. నయన్, విఘ్నేశ్ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ ఆడియో లాంచ్ కార్యక్రమంలో విఘ్నేశ్‌ను నయన్.. ‘ఫియాన్సే’ అని సంబోధించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఇప్పుడు విఘ్నేశ్, నయన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. సినిమాకు 1981లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నెట్రికాణ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను అప్పట్లో కే బాలచందర్ తెరకెక్కించారు.
సినిమా టైటిల్‌ను వాడుకుంటామని విఘ్నేశ్.. బాలచందర్‌కు చెందిన కవితాల్య ప్రొడక్షన్స్‌ను కోరారు. ఈ సినిమాకు విఘ్నేశ్ నిర్మాతగా వ్యవహరిస్తు్న్నారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. నయన్‌తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘ఇద్దరం కలిసి మరోసారి షూటింగ్ చేస్తున్నాం. అయితే ఈసారి మా రోల్స్ వేరు. త్వరలో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే వీరి ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయాక కూడా నయన్ ఫొటోలో ముఖం చూపించకుండా చేత్తో కవర్ చేసుకున్నారు. ఎవ్వరికీ తెలీకుండా ఉండటానికా లేక పాత్ర కోసం ఆమె ముఖానికి ఏమన్నా చేయించుకున్నారా అన్నది నయన్‌కే తెలియాలి. దాదాపు ఐదేళ్ల నుంచి విఘ్నేశ్, నయన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa