ఇటు తెలుగు, అటు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది నటి నయనతార.ఆమె నటించిన సైరా చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె తన 65వ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తుండగా, మిలింద్ రవ్ తెరకెక్కిస్తున్నాడు. థ్రిల్లర్‌తో పాటు ఆసక్తికరంగా ఉండనున్న ఈ చిత్రానికి నెట్రికన్న్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో టైటిల్ బ్రెయిలీ లిపీతో రూపొందించినట్టుగా ఉంది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కనిపించనున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్ అతి త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa