by Suryaa Desk | Thu, Dec 19, 2024, 03:41 PM
పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ ఆరోగ్యం క్రిటికల్ గా ఉంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని... రూ. 25 లక్షల సాయం అందిస్తామని అల్లు అర్జున్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి అండగా ఉంటానని బన్నీ ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు అందాయని కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్ నేత బక్క జడ్సన్ స్పందిస్తూ... రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం అందలేదని చెప్పారు. కేవలం రూ. 10 లక్షల సాయం మాత్రమే బాధితులకు అందిందని తెలిపారు. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ... శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు
Latest News