ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెల కిందటే పెళ్లి.. ఆ వార్త విని ఆస్పత్రి పైనుంచి దూకి బలవరన్మరణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 07:23 PM

నెల రోజుల కిందటే వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఆ నవదంపతులు. ఎంతో సంతోషంగా పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఆ కొత్తజంటను చూసి విధికి కన్నుకుంటిందో ఏమో.. వారి జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేసింది. ప్రమాదంలో ఆ జంటకు ఎలాంటి హానీ జరగలేదు కానీ.. అతను విన్న ఓ వార్తతో తీవ్ర భయాందోళనకు గురై ఆస్పత్రి బిల్డింగ్ మీద నుంచి దూకి.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన.. హైదరాబాద్ ఎల్బీనగర్‌‌లో జరిగింది.


హైదరాబాద్ నగరానికి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి అనే యువకునికి నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. కాగా.. ఇటీవలే రితీష్ ఓ యాక్సిడెంట్ చేశాడు. ఆ ప్రమాదంలో రితీష్‌కు గానీ అతని భార్యకు గానీ ఎలాంటి హానీ జరగలేదు. కానీ.. తాను గుద్దిన వ్యక్తికి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ వ్యక్తికి చికిత్స అందించినప్పటికీ.. ప్రాణం మాత్రం దక్కలేదు. తాను యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చనిపోయాడన్న విషయం రితీష్‌కు తెలిసింది. ఈ విషయం తెలియగానే.. ఎన్టీఆర్ నగర్‌లో ఉన్న శ్రీఆద్య ఆసుపత్రికి కారులో వెళ్లిన రితీష్.. నేరుగా బిల్డింగ్ పైకి ఎక్కాడు. అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.


అయితే.. తాను యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చనిపోయాడన్న భయమో.. లేదా తన వల్లే ఓ మనిషి ప్రాణాలు కోల్పోయాడన్న అపరాధభావంతో.. ఆస్పత్రి బిల్డింగ్‌ మీది నుంచి దూకి తనకు తానుగా శిక్ష విధించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో.. ఒక్క ప్రమాదం రెండు కుటంబాలను కబళించినట్టయింది. అయితే.. ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. పెళ్లి జరిగిన నెల రోజులు కాకుండానే ఓ అమ్మాయి జీవితం ఎటూకాకుండా మిగిలిపోవటం అందరినీ కలచివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa