కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ పోద్దా మంగళవారం ఎటువంటి ఆధారం లేని నగదును పట్టుకున్నట్లు ఎస్సై రాజారామ్ తెలిపారు. వాహన తనిఖీలలో భాగంగా ఓ మహిళ ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకు వెళుతుంటే గుర్తించి అటువంటి డబ్బుకు తగిన రసీదు ఇచ్చి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదుకు సంబంధించిన సరైన ఆధారాలతో కూడిన పత్రాలు చూపిస్తే ఇవ్వనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa