పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం నుంచి మొదలుకానుంది. వివిధ జిల్లాల నుంచి 2, 10, 480 జవాబుపత్రాలు ఖమ్మం చేరుకోగా, నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఈనెల 12వ తేదీ వరకు మూల్యాంకనం చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగే క్యాంపులో ఒక్కో ఉపాధ్యాయుడు గరిష్టంగా 40జవాబుపత్రాలు దిద్దాల్సి ఉంటుంది. ఈ క్యాంపనకు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్ పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa