కరీంనగర్ వైపు వెళ్లే రాజీవ్ రహదారిపై హకీంపేట సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాహనాల్లో ఫిల్ చేసే సీఎన్జీ గ్యాస్ సిలిండర్స్ తీసుకెళ్తున్న ఓ వాహనానికి ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు మరింత వ్యాపించి వెనక ఉన్న సిలిండర్లు పేలితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa