నల్గొండ జిల్లా దేవరకొండలో శుక్రవారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి ఎమ్మెల్యే బాలు నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం దివంగత నేత బాబు జగ్జీవన్ రామ్ అలుపెరుగని కృషి చేసాడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa