పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి చౌరస్తాకు శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఆయన మల్లు రవికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa