హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవిలత సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఏం పనంటూ మరికొందరు ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa