నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హౌసింగ్ బోర్డులోని పోలింగ్ బూత్ లో సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి వృద్ధులను, వికలాంగులను పోలింగ్ సెంటర్ వరకు తీసుకెళ్ళి ఓటు వేయించాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa