బీహార్‌లో తొమ్మిదేళ్లుగా నిర్మిస్తున్న బ్రిడ్జి ముచ్చటగా మూడోసారి కుప్పకూలింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం రూ.1717 కోట్లు చేసింది. ఇప్పటికే రెండు సార్లు కూలిన ఈ బ్రిడ్జి శనివారం మరోసారి కూలింది. దీంతో నిర్మాణంలో ఉండగానే ఇన్నిసార్లు కూలిన బ్రిడ్జి.. నిర్మాణం పూర్తయ్యాక ఎన్నిరోజులు నిలుస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో సుల్తాన్ గంజ్ - అగువాని గంగా నది రూట్‌లో ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది.
నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి తొమ్మిదేళ్లు గడిచినా పూర్తికాకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కట్టిన వాటిలో రెండు పిల్లర్లు కూడా కూలిపోవడంపై నిపుణులు మండిపడుతున్నారు. కాగా, ఖగరియా జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదనే విమర్శలపై పాట్నా హైకోర్టు స్పందించి, నిర్మాణ పనులపై స్టే ఇచ్చిందన్నారు. ఇప్పటికే పూర్తయిన భాగాన్ని కూడా కూల్చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించిందన్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా వంతెన కూల్చివేత పనులు చేపట్టారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa