వినాయకుని నిమజ్జనం విషయమై యువకులు బహిరంగా ఘర్షణకు దిగిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. స్థానిక సొసైటీ కాలనీలోని భాస్కర్ పాల డిపో సమీపంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో సోమవారం పూజలు ముగించారు. సాయంత్రం నిమజ్జనం చేయాలని ఓ వర్గం.. మంగళవారం చేద్దామని మరో వర్గం వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa