జిల్లాలో ఈనెల 17వ తేదీన నిర్వహించే వినాయక నిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 720 మంది కానిస్టేబుల్ తో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డివిజన్ స్థాయిలో బందోబస్తును డీఎస్పీలు పర్యవేక్షిస్తారని వివరించారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa