ఖమ్మం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుబ్బారావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa