మెదక్,కరీంనగర్, నిజామాబాదు,అదిలాబాదు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చెయ్యనున్నట్లు ట్రస్మా రాష్ట్ర కోశాధికారి, జగదేవపూర్ ది మాస్టర్ మైండ్ పాఠశాల కరస్పాండెంట్ రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సభ్యులు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పట్టభద్రులు తమ ఓటును ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు.
అన్ని జిల్లాలో పర్యటించి పట్టభద్రులను కలవడం జరుగుతుందన్నారు. గతంలో పటాన్ చెరువు డిసిసిబి డైరెక్టర్ గా, పీఏసిఎస్ చైర్మన్ గా పనిచేసినట్లు తెలిపారు. అలాగే లయన్స్ క్లబ్ సభ్యులుగా సేవ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గ ట్రస్మా సభ్యులు రాఘవేందర్ కు మద్దతు ప్రకటించి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా సభ్యులు చంటి, కరుణాకర్ రెడ్డి, రామస్వామి, మహేష్ పాల్గొన్నారు...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa