హైదరాబాద్ లో భారీ చోరీ కలకలం రేపింది. బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణ జ్యువెలర్ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన యాజమమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు షాప్ లో ఉన్న ఆభరణాల వివరాలు సేకరించారు. ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో షాప్ మేనేజర్ సుకేతు షా కనిపించకపోవడంతో పాటు అతడి ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ వస్తోంది. దీంతో యాజమాన్యం అతడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa