తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. వచ్చే సంవత్సరానికి సంబంధించి హాలిడే కేలండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 ఫిబ్రవరిలో రెండో శనివారం మినహా.. మిగతా అన్ని నెలల్లో ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న సెలవు దినంగా ప్రకటించడంతో.. ఫిబ్రవరి రెండో శనివారం వర్కింగ్ డే అని వెల్లడించింది.
సంక్రాంతి, హోలీ, ఈద్, దసరా, దీపావళి, క్రిస్ట్మస్ లాంటి పండుగలతోపాటు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లాంగ్ వీకెండ్ రానుంది. ఈ పండుగలు శుక్రవారం లేదా సోమవారాల్లో వస్తుంటడమే దీనికి కారణం. రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహార్రం ఆదివారం రోజున వస్తున్నాయి. కింద పేర్కొన్న సెలవు దినాలతోపాటు గరిష్టంగా 5 ఆప్షనల్ హాలిడేస్ కూడా తీసుకునే వీలుంది.
2025 హాలిడేస్ లిస్ట్:
* జనవరి 1 - న్యూ ఇయర్ డే - బుధవారం
* జనవరి 13 - భోగి - సోమవారం
* జనవరి 14 - సంక్రాంతి - మంగళవారం
* జనవరి 26 - రిపబ్లిక్ డే - ఆదివారం
* ఫిబ్రవరి 26 - మహా శివరాత్రి - బుధవారం
* మార్చి 14 - హోలీ - శుక్రవారం
* మార్చి 30 - ఉగాది - ఆదివారం
* మార్చి 31 - రంజాన్ - సోమవారం
* ఏప్రిల్ 1 - రంజాన్ మరుసటి రోజు - మంగళవారం
* ఏప్రిల్ 5 - బాబు జగ్జీవన్ రామ్ జయంతి - శనివారం
* ఏప్రిల్ 6 - శ్రీరామ నవమి - ఆదివారం
* ఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతి - సోమవారం
* ఏప్రిల్ 18 - గుడ్ ఫ్రైడే - శుక్రవారం
* జూన్ 7 - బక్రీద్ - శనివారం
* జూలై 6 - మొహార్రం - ఆదివారం
* జూలై 21 - బోనాలు - సోమవారం
* ఆగస్టు 15 - ఇండిపెండెన్స్ డే - శుక్రవారం
* ఆగస్టు 16 - శ్రీకృష్ణాష్టమి - శనివారం
* ఆగస్టు 27 - వినాయక చవితి - బుధవారం
* సెప్టెంబర్ 5 - ఈద్ మిలాదున్ నబీ - శుక్రవారం
* సెప్టెంబర్ 21 - బతుకమ్మ ప్రారంభం - ఆదివారం
* అక్టోబర్ 2 - గాంధీ జయంతి - గురువారం
* అక్టోబర్ 3 - విజయదశమి మరుసటి రోజు - శుక్రవారం
* అక్టోబర్ 20 - దీపావళి - సోమవారం
* నవంబర్ 5 - కార్తీక పౌర్ణమి - బుధవారం
* డిసెంబర్ 25 - క్రిస్మస్ - గురువారం
* డిసెంబర్ 26 - బాక్సింగ్ డే - శుక్రవారం