ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 06:46 PM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడి సిద్ధిఖి నగర్‌లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం పక్కకు ఒరిగింది. పక్కన ప్రారంభమైన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆ ప్రభావం పడిందని అంటున్నారు. దీంతో నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ భవనం ఒక్కసారిగా గుంతల వైపు వంగింది.ఈ భవనం చుట్టుపక్కల స్థానికులను హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించి, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్నారు. పైఅంతస్తు నుంచి కూల్చివేతను ప్రారంభించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది పనులను పర్యవేక్షిస్తోంది. ఈ భవనం పూర్తిస్థాయిలో కూల్చివేసేందుకు మరికొన్ని గంటలు పట్టనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com