వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిలు సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు పిల్లలు కానరాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు . కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హారిక (14) మరియు లక్ష్మీ దుర్గ (13) విద్యార్థినిలు అదృశ్యం. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం రోజులాగే స్కూల్లో ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు వదిలి తిరిగి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లిన తల్లిదండ్రులకు తమ పిల్లలు కానరాకపోవడంతో స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపాల్ ను సంప్రదించడంతో ఇప్పుడే వెళ్లిందని చెప్పగా చుట్టుపక్కల ఉన్న దుకాణాలను వెతికి ఎంతసేపటికి కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పోలీసు వారు దయచేసి తమ పిల్లల్ని క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు.