ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీన్ లో భాగంగా ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 21, 2024, 02:39 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న నిర్ణయాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఐద్వ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని కానీ అవి అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. మహిళలు ఏకమై తిరగబడితే ప్రభుత్వాలు గాల్లో కొట్టుకుపోతాయని అన్నారు. ప్రజలు తిరగబడక ముందే వాగ్దానాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దగ్గర ప్రభుత్వ అధికారులు గాలికొదిలేసారని ఏ ఒక్కరూ ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. జిల్లా అధికారులకు నుండి మండల స్థాయి అధికారుల వరకు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. ఎక్కడ ప్రభుత్వ అధికారులు బాధ్యతగా వ్యవహరించడం లేదని దీనివలన ప్రజా పాలన స్తంభించిపోతుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరును మధ్యమే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని ఎక్కడ చూసినా గల్లి గల్లికి బెల్ట్ షాపులు వెలిశాయని మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.  మద్యం విచ్చలవిడి తన వలన నేరాలు పెరిగిపోతున్నాయని మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు కారణం మధ్యమేనని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా మహిళల సమస్యలపై ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
మహిళా బిల్డింగులు కట్టడగానే సరిపోదని మహిళా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.  ప్రభుత్వము నేటికి రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా లేదని ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 14 రకాల నెత్యవసర వస్తువులు సరఫరా చేయాలనే డిమాండ్ చేశారు. మహిళల పౌష్టిక ఆహారం అందాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.  పెరుగుతున్న ధరల వలన తినలేని కొనలేని స్థితి ఏర్పడిందని ప్రతి వస్తువుల ధరలు నియంత్రణ లేదని ప్రభుత్వం ఉందా లేదా అనే విధంగా ప్రజలు భావిస్తున్నారని తీవ్రమైన వ్యతిరేకత రాకముందే సక్రమంగా పాలన కొనసాగించాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ జిట్టా సరోజ జిల్లా ఆఫీసు బేరర్స్ చనబోయిన నాగమణి, భూతం అరుణకుమారి, తుమ్మల పద్మ, కారంపూడి ధనలక్ష్మి, మహమ్మద్ సుల్తానా, దామెర లక్ష్మీ, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, ఉమా రాణి, కౌసల్య ,జంజిరాల ఉమా, భక్త పద్మ, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com