గురుకుల సిబ్బందిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల వసతి గృహాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అన్నం, కూరలు, సాంబారు పెరుగు నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెస్ చార్జీలు పెంచినప్పటికీ భోజనంలో నాణ్యత లేదంటూ ఏజెన్సీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు.