కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపుమార్చి ప్రతిష్టించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
పెద్దొళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట ఉద్యమ సమయంలో మేధావులు, కవులు, కళాకారుల ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి ప్రతిష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బేగరి నర్సిములు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.