ముస్తాబాద్ మండల కమిటీ సమావేశం సిపిఐ మండల కార్యదర్శి మిద్దె నరసన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు హాజరై వారు మాట్లాడుతూ డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు కావస్తా ఉన్నది ఈ 100 సంవత్సరాల కాలంలో అనేకమంది కమ్యూనిస్టు యోధులు అమరత్వం పొందారు బ్రిటిష్ వలసవాదుల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి కమ్యూనిస్టులు ఎంతో త్యాగం చేశారు డబ్ల్యూటీవో అమెరికా దోపిడి విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసింది 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంటులో 50 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఉంది ప్రపంచం గర్వించేలా తెలంగాణ రాష్ట్రంలో 48 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టులు మూలంగానే జరిగింది దీని మూలంగా మూడు లక్షల ఎకరాల భూమి పేదల వశమైనది 3000 గ్రామాలు నైజాం సర్కార్ నుంచి విముక్తి అయ్యాయి 4500 మంది కమ్యూనిస్టు యోధులు రక్తతర్పణం చేయాల్సి వచ్చింది.
దున్నేవానికి భూమి కావాలని పోరాటం చేసి దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బానిసత్వం ఎట్టి చాకిరి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడింది ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటులో కమ్యూనిస్టు పార్టీ పాత్ర మరువలేనిది దీన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 26 నుంచి ఒక సంవత్సర కాలం పాటు సభలు సమావేశాలు అమరుల స్మరించుకోవడం జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక కట్టుబడి ఆశయాలు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నటువంటి ఎంతోమంది కమ్యూనిస్టు కార్యకర్తలకు సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం జిల్లాలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంటి స్థలముంటే ఇండ్లు కట్టుకోవడానికి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు బీసీలకు 5 లక్షలు ఇస్తానని హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ జెడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్లకు పోటీ చేస్తుంది వామపక్ష ప్రజాతంత్ర భావన కలిగిన వ్యక్తులకు మద్దతును ప్రకటన చేస్తుంది ఈ సమావేశంలో భూదన్న నరసయ్య రాజేందర్ శంకర్ బాలరాజు ఆనందు రాములు అనీలు గంగధర్ బాల నర్సు తదితరులు పాల్గొన్నారు.