ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. ఈనెల 25 నుంచి జనవరి 9 వరకు ఈ రైళ్లు రద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 07:17 PM

తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ జారీ చేసింది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా పలు ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరికొన్ని ట్రైన్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాజీపేట-కొండపల్లి సెక్షన్‌లోని మోటమర్రి రైల్వే స్టేషన్‌ వద్ద ప్రస్తుతం మూడో రైల్వే లైను నిర్మాణంలో ఉందన్నారు. ఇందులో భాగంగా చేపట్టనున్న నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల దృష్ట్యా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నడిచే పలు ట్రైన్లను రద్దు చేసశారు. ఈ నెల 25 నుంచి జనవరి 9 వరకు పలు ట్రైన్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని రైల్వే అధికారులు వెల్లడించారు.


రద్దయిన ట్రైన్ల వివరాలు..


డిసెంబరు 25- జనవరి 9 మధ్య.. డోర్నకల్‌-కాజీపేట మెమూ(07754), డోర్నకల్‌-విజయవాడ మెమూ(07755), కాజీపేట-డోర్నకల్‌ మెమూ(07753), విజయవాడ-భద్రాచలం రోడ్డు మెమూ(07979), భద్రాచలం రోడ్డు-విజయవాడ మెమూ(07278) విజయవాడ-డోర్నకల్‌ మెమూ(07756) ట్రైన్లు రద్దుచేశారు. డిసెంబరు 28, 29, జనవరి 02, 05, 07, 08, 09 తేదీల్లో.. ట్రైన్ నంబర్ 12705 గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నెంబర్ 12706 సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌. డిసెంబరు 27, జనవరి 01, 04, 07, 08, 09 తేదీల్లో.. ట్రైన్ నంబరు 12713 విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నెంబర్ 12714 సికింద్రాబాద్‌-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు క్యాన్సిల్ చేశారు.


పాక్షితంగా రద్దయిన ట్రైన్ల వివరాలు.. డిసెంబరు 27- జనవరి 09 మధ్య ట్రైన్ నంబరు 17201 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్, గుంటూరు-కాజీపేట, ట్రైన్ నెంబర్ 17202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట-గుంటూరు ట్రైన్‌ను రద్దు చేశారు. దూర ప్రాంతాల మధ్య నడిచే పలు ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లను డైవర్ట్ చేశారు. డిసెంబరు 27, 28, జనవరి 01, 04, 06, 07, 08 తేదీల్లో ట్రైన్ నెంబర్ 17406 ఆదిలాబాద్‌-తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను, జనవరి 07, 08, 09 తేదీల్లో ట్రైన్ నంబరు 20834 విశాఖపట్నం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను రీ-షెడ్యూల్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa