మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేటలో సోమవారం మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు వర్థంతి సందర్భంగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పీవీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశ ప్రధానిగా, సరళీకృత ఆర్థిక విధానాల రూపకల్పనలో పీవీ నరసింహారావు సేవలు వెలకట్టలేనివి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.