AP: విశాఖలోని అక్కయ్యపాలెంలో ఓ బాలుడు షూ లేస్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు (13) అమ్మమ్మ వద్ద ఉంటూ ఓ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడు ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడేవాడు. ఏమైందో తెలియదు. బాత్రూంలో షూ లేస్‌లతో హ్యాంగర్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.