క్రిస్మస్, మహాకుంభ మేళా పండుగలను పురస్కరించుకొని వివిధ ప్రదేశాలకు 12 ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఈనెల 24, 25తేదీల్లో కలబురిగి- బెంగళూరు మధ్య రెండు, కుంభమేళా జరిగే వారణాసి, గోంతినగర్, గయా.. తదితర ప్రాంతాలకు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు మరో 10 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ రైళ్లను వినియోగించుకోవాలని కోరారు.