బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లకు హైకోర్టులో ఊరట లభించింది.ఇదివరకే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరిగ్గా లేవని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదు దారుడికి నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ విచారణ చేపట్టగా.. తాజాగా హైకోర్టు ఆ నోటీసులను సస్పెండ్ చేసింది. విచారణ వచ్చే నెల 7 వ తేదీకి వాయిదా వేసింది.