కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలోని శ్రీ రాజా రాజేశ్వర ఆలయంలో చోరీకి యత్నించిన భైంసాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం భైంసా ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఆలయంలో చోరీకి యత్నించగా సీసీ ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు. కారు, 10 వేల నగదు, బంగారు ఆభరణాలు స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు.