హైదరాబాదీలకు లవ్ ఆఫ్ బిర్యానీ ఈ ఏడాది పీక్స్‌కి చేరిందని చెప్పొచ్చు. ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.2024లో హైదరాబాదీలు సుమారు 1.57 కోట్ల బిర్యానీ ఆర్డర్లు చేయగా.. ప్రతి నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేసినట్టు తెలిపింది. అటు హైదరాబాదీల ఫేవరెట్ స్వీటుగా ‘డబుల్ కా మీటా’ నిలిచింది.ఇక చికెన్ బిర్యానీల విషయానికొస్తే.. 2024లో హైదరాబాద్‌లో ఏకంగా 97.21 లక్షల చికెన్ బిర్యానీ ప్లేట్లు ఆర్డర్ అయ్యాయి. అంటే ప్రతి ఒక్క నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేశారు. అలాగే ఓ ఫుడ్డీ 60 బిర్యానీల కోసం ఒకే ఆర్డర్‌లో రూ.18,840 వెచ్చించాడట. అలాగే ఈ ఏడాది స్విగ్గీలో మొత్తం 4,46,000 చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారు. అటు టీ20 ప్రపంచకప్ సమయంలో 8,69,000 ప్లేట్ల చికెన్ బిర్యానీని లాగించారు.ఇక హైదరాబాదీల బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే.. వారు దోశలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, అందులోనూ ఉల్లిదోశపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫార్మ్ స్విగ్గీ తెలిపింది. దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశను ఆర్డర్ చేసింది హైదరాబాద్ వాసులే అని తేలింది. ఆనియన్ దోశలు అటుంచితే.. సాదాసీదా దోశలు కూడా ఈ ఏడాది ఏకంగా 17.54 లక్షల ఆర్డర్లు జరిగాయి.