దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన పసిడి రేట్లు నేడు (డిసెంబర్ 26) వరుసగా రెండో రోజు మరింత ఎగిశాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.71,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,730 వద్ద ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.250, రూ.280 చొప్పున పెరిగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి రూ.71,400 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.280 ఎగిసి రూ.77,880 వద్దకు చేరాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.250, 24 క్యారెట్ల బంగారం రూ.280 పెరిగాయి. వీటి ధరలు ప్రస్తుతం రూ.71,250, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,730 లుగా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు మరోసారి పెరిగాయి. కేజీకి రూ.1000 చొప్పున పెరగడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు, ఢిల్లీలో రూ.92,500 వద్దకు చేరుకుంది.