ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేరు వచ్చినంత మాత్రాన పథకాలు వచ్చినట్లు కాదు,,,ఇంకా లిస్టు ఫైనల్ కాలేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2025, 07:49 PM

తెలంగాణ ప్రభుత్వ పథకాలు, గ్రామసభల్లో విడుదల చేస్తున్న లిస్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వచ్చినట్లు కాదన్నారు. ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లయ్ చేసుకోని వారుంటే వారు కూడా అప్లయ్ చేసుకుంటారనే ఉద్దేశ్యంతో లిస్టు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ సభలు ఫూర్తయిన తర్వాత.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అన్ని క్రోడీకరించి.. అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు. ప్రస్తుతం గ్రామసభల్లో విడుదల చేసిన లిస్టు సెలెక్టడ్ లిస్టు కాదని అన్నారు. అది కేవలం దరఖాస్తు చేసున్నవారి లిస్టు మాత్రమేనని చెప్పారు.


ఎన్ని అఫ్లికేషన్లు వచ్చినా.. చిట్ట చివరి లబ్ధిదారులకు కూడా పథకాలు ఇవ్వలన్నేది తమ ఆలోచన అని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు, కుటుంబాలు వేరు పడిన వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులు తీసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు తొలి విడతలో నిరు పేదలకు ఇస్తామన్నారు. ఇండ్లులేని వారికి ఇండ్లు ఇచ్చి ఆ తర్వాత.. అర్హతలను బట్టి అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కావాలనే కొందరు రాజకీయ నేతలు.. నాలుగు పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అర్హులైన అందరికీ అన్ని పథకాలు వర్తిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి భరోసా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com