జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని, తొత్తినోని దొడ్డి గ్రామానికి చెందిన భార్కి భీమన్న మిర్చి బస్తాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. సోమవారం మధ్యాహ్నం తనకున్న 3 ఎకరముల పొలంలో పండించిన మిర్చి పంటను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు బస్తాల్లో నింపారు.
భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లి గంట తరువాత వచ్చి చూస్తే బస్తాలకు నిప్పంటుకుని మండుతున్నాయి. వెంటనే మంటలను ఆర్పగా 10 క్వింటాల్ల వరకు కాలిపోయినట్లు రైతు తెలిపారు. ఈ సంఘటనపై అయిజ తహసీల్దార్ కు బుధవారం ఫిర్యాదు చేసినట్లు రైతు భీమన్న తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa