తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా రఘునాథపాలెం మండలం జింకలగూడెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు, వైరా వాసవి కళ్యాణ మండపంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.
నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో వైరా ఎంఎల్ఏ మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, విజయబాయి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa