హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే 1వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 28న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 4 నామినేషన్లు దాఖలుకు ఆఖరి గడువు. 7న దాఖలైన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa