శ్రమ గొప్పదనాన్ని చాటి చెప్పే రోజే ఈ మేడే అని శ్రమను గౌరవిద్దాం కార్మికులకు అండగా ఉందామని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. మే డే కానుకగా మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కార్మికులు ఎంతగానో శ్రమిస్తారని, వారి శ్రమతోనే ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం సమకూరుతాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa