సింగర్ నల్గొండ గద్దర్ నర్సన్న పుట్టినరోజు సందర్భంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ బైపాస్ సమీపంలోని ఐకెపి సెంటర్ వద్ద ఆదివారం మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సంఘం జిల్లా ఈసీ మెంబర్ డాక్టర్ కంబాల శివలీల మాట్లాడుతూ, ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్లలో రైతుల కోసం తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa