సీఎం సహాయ నిధి పేదల కోసం వరంగా మారిందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి garu పేర్కొన్నారు. శనివారం మక్తల్ పట్టణంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పలువురు అవసరమైనవారికి సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా రుద్ర సముద్రం గ్రామానికి చెందిన మలిగేరి లింగమ్మకు రూ. 47,000, జగదీశ్వరికి రూ. 18,000 మరియు చిన్న కడుమూరు గ్రామానికి చెందిన రవికి రూ. 38,000 విలువైన చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవసరమున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ముందుకు రావాలని, ఎవరైనా ఆర్థిక సహాయానికి అర్హులైతే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa