నగరంలోని చారిత్రక చార్మినార్ వద్ద నేడు మంగళవారం “72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్” ఘనంగా జరగనుంది. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఈ హెరిటేజ్ వాక్‌లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పోటీదారులు పాల్గొని, హైదరాబాద్ నగర వారసత్వ సంపదను ప్రపంచానికి చాటనున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం చౌమల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్ ప్రతినిధుల కోసం వెల్కమ్ డిన్నర్ నిర్వహించనున్నారు. రేపు (మే 14) పోటీదారుల్లో ఒక బృందం వరంగల్ జిల్లాలో పర్యటించి, అక్కడి చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని సందర్శించనుంది.
ఈ హెరిటేజ్ వాక్ ద్వారా తెలంగాణ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa