హైదరాబాద్-చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఓ గుణపాఠం లాంటిదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వం త్వరలోనే అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తుందని వివరించారు. పురాతన భవనాల్లో అగ్నిప్రమాద భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వాటినితనిఖీ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.
![]() |
![]() |