మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదర్శ నగర్ కాలనీలోని సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శ నగర్ కాలనీని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా ఈ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో నివసిస్తున్న పేదలకు అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa