ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 10:16 AM

AP: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి దర్శనం కోసం సుమారు 18 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గురువారం 59,194 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,295 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa