నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలానికి చెందిన బుస్సాపూర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న నవీన్ కుమార్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సస్పెండ్ చేశారు.
శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రవర్తన తీవ్ర విమర్శలకు లోనైంది. శిక్షణ సెంటర్‌లో కో-ఆర్డినేటర్లు మరియు రీసోర్స్ పర్సన్లపై ఆసభ్యపదజాలంతో దూషించడమే కాక, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఈవో)పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సంఘటనను ధృవీకరించి, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ విధించారు. విద్యా వ్యవస్థపై మర్యాద మరియు నియమాలు పాటించాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయులు ఇలాంటి ప్రవర్తనతో దూషణకు గురవుతుండడం ఆందోళనకరం. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ కేసును గంభీరంగా తీసుకొని, తదుపరి చర్యలపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa