హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలలో ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో శుక్రవారం ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామానికి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి భజన మండలి సభ్యులు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు భక్తిశ్రద్ధలతో స్వామి వారి భజనలు చేశారు. తిరుమల తిరుపతిలో స్వామివారి సన్నిధిలో భజనలు చేసే అవకాసం లభించడం తమకు మహా అదృష్టంగా భావిస్తున్నామని భజన మండలి అధ్యక్షుడు దొరోళ్ల కృష్ణయ్య తెలిపారు.
ఈ భక్తిమయ కార్యక్రమంలో భజన సభ్యులు ఉత్సాహంగా పాల్గొని, తమ స్వరంతో హరినామ సంకీర్తన గీతాలతో వాతావరణాన్ని పునీతం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa