HCA అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. IPL టికెట్ల వ్యవహారంలో HCA అక్రమాలపై విజిజెన్స్ విచారణ జరుపుతోంది. ఈ మేరకు మంగళవారం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. SRH ఫ్రాంచైజీపై HCA సెక్రటరీ ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారించింది. టికెట్ల కోసం SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు తేలింది. ఇప్పటికే 10% టికెట్లు ఫ్రీగా ఇస్తున్నా.. మరో 10 % ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు నివేదికలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa