ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 01:24 PM

పిచ్చికుక్క దాడి చిన్నారి ప్రాణం తీసిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లితండాలో చోటుచేసుకుంది. ఈ నెల 13న ఇంటి ఎదుట ఆడుకుంటున్న బానోతు నిహారిక (5)పై పిచ్చికుక్క ఆకస్మికంగా దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
తక్షణమే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతున్న నిహారిక ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఆమె మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa