తెలంగాణలో వడగళ్ల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నష్టపరిహారం కోసం ప్రభుత్వం బుధవారం రూ. 51.528 కోట్ల నిధులను విడుదల చేసింది.
మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు, ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని, నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయాలని అధికారులకు సూచించారు. ఈ చర్య రైతులకు తక్షణ ఆర్థిక ఊరటను కల్పించడంతో పాటు, వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa