నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (ఎంజియూ) పరిధిలో డిగ్రీ కోర్సు అభ్యసించి ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు చివరి అవకాశంగా నిర్వహించిన బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మార్చ్/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్ష నియంత్రణాధికారి డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.
సంవత్సరం విధానంలో డిగ్రీ చదివిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడిందని ఆయన స్పష్టంచేశారు. ఫలితాల పూర్తి వివరాలను ఎంజియూ అధికారిక వెబ్‌సైట్‌లో (www.mguniversity.ac.in) పొందుపరిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను వెబ్‌సైట్‌లో లాగిన్ అయి చెక్ చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa