ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు 5 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
పిప్పర్‌వాడ టోల్ ప్లాజా, జైనథ్‌లోని ఆనంద్‌పూర్, బేల మండలంలో శంకర్‌గూడ, తలమడుగు మండలంలో లక్ష్మీపూర్, బోథ్ మండలంలో ఘన్పూర్ వద్ద ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనదారులు అన్ని అవసరమైన పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని డీఎస్పీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa